నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు జార్జ్ మున్సే (84; 54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ మెరివగా మరో ఓపెనర్ మైకేల్ జోన్స్ (37; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత వచ్చిన బ్రాండన్ మెక్‌ముల్లెన్ (41*; 18 బంతుల్లో 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. రిచీ బెరింగ్టన్ (15) పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మైకేల్ లీస్క్ (22*; 5 బంతుల్లో) బాదేయడంతో స్కోరు 207కు చేరింది.ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, స్మట్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
T20 World Cup: ఇటలీపై స్కాట్లాండ్ భారీ స్కోరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



