- కొలంబోలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి పోరు
నవతెలంగాణ-హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ లీగ్ మ్యాచ్‌లు ముగిసిన విషయం తెలిసిందే. ప్రారంభ మ్యాచ్‌ల్లో పెద్ద జట్లలకు చిన్న టీంలు ఝలక్ ఇచ్చాయి. ఇంగ్లాండ్‌కు నేపాల్ ముప్పు తృటిలో తప్పిపోగా, దక్షణాఫ్రికాను అప్ఘనిస్థాన్ ఓడించేంత పని చేసింది. రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. క్రికెట్ దిగ్జజ టీంమైన ఆసీస్‌ను లీగ్ దశలోనే జింబాబ్వే ఇంటికి సాగనంపగా..గ్రూప్ లీగ్ చివరిలో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు శ్రీలంకను కూడా ఓడించి మరో సంచలనం నమోదు చేసింది జింబాబ్వే జట్టు. ఎలాంటి అంచనాలకు లేకుండానే మెగ టోర్నీలోకి అడుగుపెట్టి..2026 టీ20 వరల్డ్ కప్‌లో పెను సంచలనాలు సృష్టించించిన జింబాబ్వే.. అంతిమంగా సూపర్-8 దూసుకెళ్లి అగ్రశ్రేణి టీంకు పెద్ద సవాల్ విసిరి క్రికెట్ విశ్లేషకులను ఆశ్యర్యానికి గురి చేసింది.
రేపట్నుంచి ధనాధన్ మెగా టోర్నమెంట్‌లో రసవత్త పోరు సాగనుంది. టైటిల్ పోరు కోసం 8 జట్లు పోటా పోటీగా ఢీకొననున్నాయి. గ్రూప్ ‘ఏ’లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, 2024 రన్నరప్ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్ ‘బీ’లో పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి.
సూపర్ 8లో భాగంగా (రేపు)శనివారం కొలంబోలో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ల మ్యాచ్‌తో ఈ కీలక ఘట్టం ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత గురువారం చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తలపడనుంది.



