Monday, March 9, 2026
E-PAPER
Homeఆటలుతుదిపోరు.. స‌ర్వం సిద్ధం

తుదిపోరు.. స‌ర్వం సిద్ధం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫిబ్ర‌వ‌రి 8న మొద‌లైన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నీ నేడు ఆఖ‌రికి ఘ‌ట్టానికి చేరుకుంది. మ‌రికొన్నిగంట‌ల్లో టైటిల్ కోసం ఆతిథ్య జ‌ట్టు టీమిండియా, ట్రోఫి క‌ల‌ను స‌హ‌కారం చేసుకోవాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్న న్యూజిలాండ్ జ‌ట్లల మ‌ధ్య అంతిమ మ్యాచ్‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇరుజ‌ట్లు గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ స్టేడియం వేదిక‌గా తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఇక‌పోతే టైటిల్ కోసం రెండు టీంలు ఎట్లా ఉన్నా..వారి ల‌క్ష్యం ఒక్క‌టే..టీం 20 వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫిని కైవ‌సం చేసుకోవ‌డమే. అందు కోసం ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు గ్రౌండ్‌లో చెమ‌ట‌డొచ్చారు. వారి వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లించ‌నోనున్నాయో కాసేప‌ట్లో తెల‌నుంది.

హిస్ట‌రీని డిఫిట్(Defeat) చేసి చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని డిపెండింగ్ చాంపియ‌న్ టీమిండియా క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాగింది ఒక ఎత్తు..కాసేప‌ట్లో మొద‌లైంది మ‌రో ఎత్తు అన్న‌ట్లుగా సూర్య‌సేన పావులుక‌దుపుతోంది. టోర్నీ ప‌రంగా టైటిల్ ఫేవ‌రేట్ టీంల్లో టీమిండియా ముందు వ‌రుస‌లో ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహాం లేదు. గ్రూప్ ద‌శ‌లో ఆమోఘంగా రాణించి..ఓట‌మి ఎదురు లేద‌ని భావించ‌గా..సూప‌ర్-8 తొలి పోరులో సౌతాఫ్రికా చేతిలో తొలి ఓట‌మి చూవిచూసింది టీమిండియా. అప్ప‌టి వ‌ర‌కు సాఫీగా ఉన్నా..ఈ ఓట‌మితో జ‌ట్టులో ఉన్న లోపాలు ఒక్క‌సారిగా బ‌హిర్గ‌తమైయ్యాయి. దీంతో ఒక్క‌సారిగా సూర్య‌సేన‌, గంబీర్ నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌కులు బాణాలు ఎక్కుపెట్టారు. లోపాలు స‌రిదిద్దుకొని బ్యాటింగ్ ఆర్డ‌ర్ మార్పులు చేర్పులు జ‌రిపి కీల‌క మ్యాచ్‌లో సూర్య‌సేన త‌మ స‌త్తాచాటింది. జింబాబ్వేపై గెలిచి..ఆ త‌ర్వాత టోర్నీలో ఓట‌మి ఎరుగ‌ని వెస్టిండీస్‌పై భార‌త్ అద్భుత విజ‌యం సాధించి.. అదే స్పూర్తితో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన‌ రెండో సెమీస్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టీంపై గ్రాండ్ విక్ట‌రీ కొట్టి ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ప్ర‌స్తుతం టైటిల్ కైవ‌సం చేసుకోవ‌డానికి ఒక్క అడుగు దూరంలో నిలిచి ఉంది.

టైటిల్ క‌ల‌ను స‌హ‌కారం చేసుకోవాల‌ని బ్లాక్ క్యాప్స్ కూడా ఉవ్విళ్లురుతుంది. గ్రూప్ ద‌శ‌లో త‌డ‌బ‌డుతూ నిల‌బ‌డిన న్యూజిలాండ్ టీం..ర‌న్ రేట్ కారణంగా సెమీస్ చేరుకుంది. ల‌క్కీగా కివీస్ సెమీస్‌కు వ‌చ్చింద‌ని అంద‌రూ త‌క్కువ అంచ‌నా వేశారు.కానీ టోర్నీ మొత్తం వ‌రుస విజ‌యాల‌తో ఊపులో ఉన్నా సౌతాఫ్రికా టీంకు కివీస్ భారీ బ్రేకులు వేసింది. స‌ఫారీల‌పై భారీ విజ‌యాన్ని న‌మోదు చేసి..త‌మ స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చూపించి తాజాగా తుదిపోరుకు ఈగ‌ల్‌గా వెయిట్ చేస్తోంది శాంటార్న్ సేన‌.

ఇరుజ‌ట్లు మ‌ధ్య గ‌త అంచ‌నాలు ఎట్ల‌లున్నా..తుదిపోరుకు స‌ర్వ‌శ‌క్తులు వ‌డైయినా టైటిల్ కైవ‌సం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. రెండేండ్ల‌కు ఒక్క‌సారి జ‌రిగే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోపీ ఎవ‌రికి వ‌రించ‌నుందో మ‌రికొద్దిసేప‌ట్లో తెలిపోనుంది. కాగా క్రికెట్ అభిమానులు కూడా ఇరుజ‌ట్లకు వెల్ ద బ్రెస్ట్ ఫ‌ర్ ఫైన‌ల్‌ గేమ్ అంటూ స్టేడియంలో శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -