Monday, March 2, 2026
E-PAPER
HomeఆటలుT20 World Cup: ఒమన్ పై జింబాబ్వే ఘన విజయం

T20 World Cup: ఒమన్ పై జింబాబ్వే ఘన విజయం

- Advertisement -
నవతెలంగాణ - హైదరాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ముజారబానీ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 13.3 ఓవర్లలో 106/2 స్కోరుతో సులభంగా గెలిచింది. బ్రియన్ బెన్నెట్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఒయన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. అమీర్ కలీం (5), జతీందర్ సింగ్ (5), హమ్మద్ మీర్జా (0), కరణ్ సోనావాలే (0), వసీమ్ అలీ (3) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో జింబాబ్వే 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. వినాయక్ శుక్లా (28) టాప్ స్కోరర్. టాప్-5 బ్యాటర్లలో ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో జింబాబ్వే 27 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో వినాయక్ శుక్లా, సుఫ్యాన్ మెహమూద్ (25) ఆరో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొమ్మిదో స్థానంలో వచ్చిన నదీమ్ ఖాన్ (20) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ (3/16), రిచర్డ్ నగరవ (3/10), బ్రాడ్ ఎవాన్స్ (3/18) సత్తా చాటారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -