Thursday, May 22, 2025
Homeతెలంగాణ రౌండప్తైక్వాండోతో క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం…

తైక్వాండోతో క్రమశిక్షణతో పాటు శారీరక దృఢత్వం…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ద్వారా  క్రమశిక్షణతో పాటు శరీరక దృఢత్వం పొందవచ్చు అని జిల్లా సెక్రెటరీ కోన్ రెడ్డి శ్రీకాంత్ అన్నారు. బుధవారం  భువనగిరి జిల్లా కేంద్రం శివారులోని  జీనియస్ హైస్కూల్లో తైక్వాండో కలర్ బెల్ట్ పోటీలు నిర్వహించగా, ఆయన ఎగ్జామినేర్గా హాజరై,, మాట్లాడారు.బ్లాక్స్ విభాగంలో, పుంసే విభాగం,  కిక్స్ విభాగంలో,  పంచెస్ విభాగాలలో క్రీడాకారులు ప్రదర్శించినటువంటి వాటిని బట్టి వారికి బెల్టులు, సర్టిఫికెట్లు ప్రధానం చేశారు . క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తైక్వాండో క్రీడ ఒలింపిక్ గుర్తింపు పొందిన క్రీడ ఎస్ జి ఎఫ్  గేమ్స్ లో  సీబీఎస్ఈ  గేమ్స్, కేంద్రీయ విద్యాలయం, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయూ సంబంధించినటువంటి క్రీడలలో తైక్వాండో క్రీడా గుర్తింపు ఉన్నందువలన  తైక్వాండో క్రీడ శిక్షణ ద్వారా  తైక్వాండో క్రీడాకారులకు విద్యా ఉద్యోగాలలో స్పోర్ట్స్ కోట ద్వారా లబ్ధి పొందవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు ఓరుగంటి రవికుమార్ ,కొండాపురం కృష్ణ కుమార్, వెలుగు రిషిగని   మరియు తల్లిదండ్రులు కాలేరు సంతోష్ , రాంబాబు, రితెష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -