Magazines

మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

4 రోజుల క్రితం

ACB raids Moinabad Municipal Office
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ–హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో.. మున్సిపల్‌ అధికారులు రూ.75 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.లక్ష లంచం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా రూ.75 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే 1064 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి, వారి పనిని చట్ట ప్రకారం పూర్తి చేయిస్తామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్