Magazines

ఢిల్లీలో భయానక వాతావరణం సృష్టించారు: రాహుల్‌గాంధీ

56 నిమిషాల క్రితం

An atmosphere of terror has been created in Delhi: Rahul Gandhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టించిందని కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో ప్రత్యేక మీడియా సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ఢిల్లీ రోడ్లపై దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించారన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రధాని మోడీ ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని అన్నారు. యువతను ఎక్కడికక్కడ నిరోధిస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలకు ఉన్న స్వేచ్ఛ యువతకు ఎందుకు లేదని ప్రశ్నించారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని, చేసేవరకు వదలిపెట్టమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్