Magazines

టీ20ల్లో వెస్టిండీస్‌ చరిత్ర.. 2,000 సిక్సర్లు బాదిన తొలి జట్టు

1 గంట క్రితం

West Indies make history in T20s.. first team to hit 2,000 sixes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో 2,000 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా నిలిచింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ అరుదైన ఘనత సాధించింది. మ్యాచ్‌కు ముందు 1,997 సిక్సర్లతో ఉన్న కరీబియన్‌ జట్టు.. తాజా ప్రదర్శనతో 2,000 మార్కును అధిగమించింది. ఈ జాబితాలో భారత్‌ కూడా 1,997 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తదుపరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కూడా ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌ సుమారు 1,585 సిక్సర్లతో మూడో స్థానంలో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్