ఫుడ్ ఆర్డర్ డెలివరీ బాయ్ పట్ల ఓ జంట అమానుషంగా వ్యవహరించింది. ఆలస్యంగా ఆర్డర్ ఇచ్చాడని బాయ్ పై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాయ్ తలకు గాయాలైయ్యాయి. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో జరిగింది. లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ ఆర్డర్ లేట్ అయిందని చెప్పినా వినకుండా జొమాటో డెలివరీ బాయ్ ఆశిపై దంపతులు దాడికి పాల్పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఫుడ్ డెలివరీ బాయ్ ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి..వీడియో
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)