Magazines

ప్రపంచకప్‌ కాంబినేషన్‌పై గిల్‌ కీలక వ్యాఖ్యలు

04 అక్టోబర్, 2026

Gill's key comments on World Cup combinations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ముగిసింది. ఈ సిరీస్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ శతకాలతో ఫామ్‌ను చాటుకోగా.. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. చివరి వన్డేలో కేఎల్‌ రాహుల్‌ కూడా శతకం సాధించాడు. సీనియర్ల ప్రదర్శన భారత్‌కు పెద్ద సానుకూలాంశమని గిల్‌ అన్నారు. రాబోయే వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో సీనియర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రపంచకప్‌ నాటికి ఎక్కువ మ్యాచ్‌లు లేకపోవడంతో ప్రయోగాలకు సమయం లేదని, అందుబాటులో ఉన్న ఆటగాళ్లతోనే జట్టు కూర్పుపై కసరత్తు చేస్తామని తెలిపారు. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చే అవసరం లేదన్నారు. ఈ నెల మూడో వారం నుంచి టీమ్‌ఇండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఐదు వన్డేలు, ఐదు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్