Magazines

ఇండోనేషియాలో భూకంపం...

1 గంట క్రితం

Earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ఇండోనేషియాలో ఆదివారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:07 గంటలకు భూమి కంపించినట్లు భారత భూకంప అధ్యయన కేంద్రం (NCS) వెల్లడించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రకంపనలతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, సునామీ ముప్పు లేదని అధికారులు తెలిపారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్