నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 79,737 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం సమకూరింది. నేడు నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రాత్రి 7 గంటలకు సేనాధిపతి విష్వక్సేనుడి ఊరేగింపు నిర్వహిస్తారు. రేపటి నుంచి ఈ నెల 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రేపు ఉదయం బంగారు తిరుచ్చి, రాత్రి పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తారు. ఈ నెల 20 వరకు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.







కామెంట్‌లు (0)