Magazines

ఈనెల 11 ఇండియా బ్లాక్ పాదయాత్ర

1 గంట క్రితం

INDIA bloc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 11 పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ వరకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తారని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ సోమవారం తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సమక్షంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షులు, ఇన్‌చార్జులతో రెండు గంటల పాటు సమావేశం జరిగిందని రమేష్ చెప్పారు. పాదయాత్రకు ముందుగా ఉదయం 10.30 గంటలకు మకర్ ద్వార్ వద్ద సమావేశం కావాలని ప్రతిపక్ష ఎంపీలను కోరినట్లు ఆయన తెలిపారు. సర్ ప్రక్రియలో ఓట్ల అక్రమాలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్‌ తొలగించడమే తమ ప్రధాన డిమాండ్‌ అని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్