నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి చెందాడు. జిల్లాలోని తడ్కోల్ వాసి అఫ్జల్‌ఖాన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం రష్యా వెళ్లాడు. ఐదు నెలలపాటు అక్కడ మెకానిక్‌గా పనిచేశాడు. ఇటీవల అతడిని సైన్యంలో ఏజెంట్ చేర్చాడు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో అతడు మరణించినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. 10 రోజుల క్రితం చనిపోయినట్లు తోటి కార్మికుడు ఆడియో సందేశం పంపాడు.






కామెంట్‌లు (0)