నవతెలంగాణ-హైదరాబాద్ : ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీలు మళ్లీ పరిశీలించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘ప్రస్తుతం అమల్లోని రోజువారీ పాస్‌కు రూ.400 (మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ రూ.100), నెలవారీ పాస్ రూ.8,500 (ఇందులో మెట్రో రూ.7 వేలు, ఆర్టీసీ రూ.1,500) గా ఉంది. ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయన్న అభిప్రాయాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనల నేపథ్యంలో త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నాం’’ అని పేర్కొన్నారు.
ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ ఛార్జీల పునః పరిశీలన: పొన్నం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)