Magazines

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణసంచా సీజ్‌

51 నిమిషాల క్రితం

Massive seizure of Chinese fireworks at Chennai port
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నతవతెలంగాణ - హైదరాబాద్ : చెన్నై పోర్టులో అధికారులు భారీగా చైనా బాణసంచాను సీజ్‌ చేశారు. హైదరాబాద్‌ జోనల్‌ డీఆర్‌ఐ, ఇంటెలిజెన్స్‌ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.12 కోట్ల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. స్టేషనరీ, మెడికల్‌ గ్లౌజులు, ప్లాస్టిక్‌ క్లిప్స్‌, వార్డ్‌ రోబ్స్‌ పేరుతో చైనా నుంచి బాణసంచాను అక్రమంగా దిగుమతి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాపారులు తప్పుడు డిక్లరేషన్‌తో సరుకును తరలించినట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్