నవతెలంగాణ-హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ లభించడం తీవ్ర కలకలం రేపింది. అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద తనిఖీల సమయంలో పోలీసులు లైవ్ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తుండగా, సదరు ప్రయాణికుడి హ్యాండ్ బ్యాగ్‌లో బుల్లెట్ ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది స్కానింగ్‌లో గుర్తించారు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ జీఎంఆర్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)