Magazines

ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గుగని ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తాం: కేటీఆర్

1 గంట క్రితం

Ktr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి రేవంత్‌రెడ్డి సర్కార్‌ సిద్దమవడాన్ని బీఆర్ఎస్‌ వ్యతిరేకిస్తోందని కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌ లో పోస్టు పెట్టారు. తెలంగాణ వారసత్వ కట్టడాలను కూల్చడానికి రేవంత్‌రెడ్డి సర్కారు కుట్రలు పన్నుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వానికి భూములు దోచుకోవడం అయిపోయింది. ఇప్పుడు భూమి లోపల ఉన్న సంపదను కొల్లగొట్టి.. వారసత్వ సంపదను దెబ్బతీసే కుట్రలకు తెరతీసిందని మండిపడ్డారు. రామప్ప దేవాలయానికి హాని చేసే ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకుంటే ఉద్యమిస్తాం’’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్