నవతెలంగాణ-హైదరాబాద్: 42 మంది మాజీ న్యాయమూర్తుల బృందం గురువారం ఒక బహిరంగ లేఖ రాసింది. ఎన్నికల సంఘం, ఇతర సంస్థలను బలహీనపరిచే ప్రయత్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, "బ్యాలెట్‌కు అర్థం పోయినప్పుడు, వీధులకు ఆ అర్థం వస్తుంది" అని వారు వాదించారు. "ఒక కథనంతో అశాంతి మొదలవుతుంది. అప్పుడు ఆ ఖాళీని అరాచక, విపరీత శక్తులు ఆక్రమిస్తాయి. వాటిలో కొన్ని స్వదేశీయులు. కొన్ని మన సరిహద్దుల అవతల నుండి ప్రేరణ పొందుతాయి," అని లేఖలో పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు భారీ నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ వెలువడంతో చర్చయానీంశంగా మారింది.
మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇండియా బ్లాక్ నాయకులు గురువారం రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో జరిగిన అవకతవకల ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)