Magazines

వైభవ్‌పై సైమ్‌ అయూబ్‌ సైగలు.. కమ్రాన్‌ అక్మల్‌ ఆగ్రహం

1 గంట క్రితం

Saim Ayub's gestures towards Vaibhav.. Kamran Akmal is angry.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు స్వర్ణ పతకం సాధించింది. వరుసగా రెండోసారి గోల్డ్‌ మెడల్‌ గెలుచుకున్న భారత్‌.. పాకిస్థాన్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ ఆసియా క్రీడల్లో పతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అయితే వైభవ్‌ను ఉద్దేశించి పాకిస్థాన్‌ ఆటగాడు సైమ్‌ అయూబ్‌ చేసిన సైగలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి చర్యలకు తావు లేదని, ఇవన్నీ మేం కేవలం సోషల్ మీడియా కోసమే చేస్తాం అన్నట్లుగా ఉంది. దీని గురించి మేనేజ్‌మెంట్ ఆలోచించాలి. ఇది అంతర్జాతీయ క్రికెట్. ప్రత్యర్థి ఆటగాడి వయసు 14 లేదా 15 ఏళ్లు అనేది తర్వాత సంగతి. అతడు ఇంటర్నేషనల్‌ క్రికెట్ ఆడుతున్నాడు. సైమ్‌ ఏమీ పిల్లాడు కాదు. సైమ్‌ అయూబ్‌ తన ఆటపై దృష్టి పెట్టాలని అక్మల్‌ వ్యాఖ్యానించాడు. ఇంతకుముందు పాక్‌ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ కూడా ఇదే విషయంపై తమ మేనేజ్‌మెంట్‌ను ఉద్దేశించి విమర్శలు చేసినట్లు గుర్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్