Magazines

ఎమ్మెల్యే వేధింపులతో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

54 నిమిషాల క్రితం

Sarpanch attempts suicide due to harassment by MLA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ :  ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి సర్పంచ్ మల్యాల తిరుపతి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మధురానగర్‌ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద క్రిమిసంహార మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అడ్డుకుని ఆయనను ప్రైవేటు వాహనంలో కరీంనగర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. గంజాయి కేసు పెడతానంటూ బెదిరిస్తున్నారని, గంగాధర పోలీసులు ఫోన్‌ చేసి కేసు నమోదైందని, నోటీసులు తీసుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంగాధర మండల సర్పంచుల వాట్సాప్‌ గ్రూపులో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచులు తనను అవమానకరంగా మాట్లాడుతున్నారని తిరుపతి ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్