Magazines

బస్సు ఆపలేదని డ్రైవర్‌, కండక్టర్‌లపై కోడిగుడ్లతో దాడి

1 గంట క్రితం

driver-and-conductor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ- హైదరాబాద్‌: బస్సు ఆపలేదని ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు డ్రైవర్‌, కండక్టర్‌లపై కోడిగుడ్లతో దాడి చేసిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం గురజాలలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మాచర్ల వెళ్తున్న బస్సును మాడుగుల అడ్డరోడ్డు వద్ద ఆపాలని ఓ మహిళ చేయి ఊపింది. అయితే డ్రైవర్‌ అక్కడ ఆపకుండా ముందుకెళ్లి ఆపాడు. అనంతరం మాచర్ల వెళ్లిన తర్వాత డ్రైవర్‌, కండక్టర్‌లు డ్యూటీలు మారారు.


వేరే డ్రైవర్‌, కండక్టర్‌లతో కూడిన అదే బస్సు తిరిగి వస్తున్న క్రమంలో ఆ మహిళా, ఆమె కుటుంబ సభ్యులు రోడ్డుకు అడ్డంగా బైక్‌లు పెట్టి అడ్డుకున్నారు. అప్పటికే బస్సు ఆపలేదనే కోపంలో ఊగిపోతున్న వారంతా కోడిగుడ్లతో డ్రైవర్‌, కండక్టర్‌లపై దాడి చేశారు. కండక్టర్‌ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురజాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్