నవతెలంగాణ - హైదరాబాద్ : ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఓటర్ల జాబితా నుంచి ప్రజల ఓట్లను తొలగించేందుకు ఉపయోగిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుంటోందని విమర్శించారు. గతంలో ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖలను వినియోగించుకున్నారని, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ద్వారా తమ వ్యతిరేకుల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యువత, నిరుద్యోగులు, పేదల ఓట్లను తొలగించాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్‌లో విభేదాలు తలెత్తాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అలాంటి అధికారిని తొలగించేందుకు ప్రధాని మోదీకి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరగని రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని, ఈ ప్రక్రియ జరిగిన బిహార్, బెంగాల్‌లో గెలిచిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ జనాభా పెరుగుతున్నప్పటికీ ఓటర్ల సంఖ్య ఎందుకు తగ్గుతోందని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిందని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని ఆయన అన్నారు.
ఓట్ల తొలగింపుకే ఎస్‌ఐఆర్ ప్రక్రియ: సీఎం రేవంత్‌రెడ్డి
37 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)