నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారాయి. దీంతో సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా కుంగింది. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా పతనమైంది. మధ్యాహ్నాం 12.50 గంటల సమయంలో సెన్సెక్స్ 905 పాయింట్లు దిగజారి 71,750.73 వద్ద ట్రేడవుతోంది.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
57 నిమిషాల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)