నవతెలంగాణ-హైదరాబాద్ : సీసీ కెమెరాలు బిగిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని రాజవోలులో చోటు చేసుకుంది. మృతులను అదే గ్రామానికి చెందిన సూర్యారావు (50), నేతాజీ నగర్ బొమ్మూరుకు చెందిన కాంట్రాక్టర్ చిన్న కృష్ణారెడ్డి (55)గా గుర్తించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఇనుప స్టాండ్‌ను తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
విషాదం..సీసీ కెమెరాలు బిగిస్తూ ఇద్దరి మృతి
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)