నవతెలంగాణ - హైదరాబాద్ : ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్లైన సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలను పెంచింది. ముడిసరుకుల ధరలు పెరగడంతో అక్టోబర్‌లో ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ కేజీ ప్యాక్ ధర రూ.167 నుంచి రూ.172కు, 500 గ్రాముల ప్యాక్ రూ.85 నుంచి రూ.87కు పెరిగింది. 250 గ్రాముల సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.42 నుంచి రూ.45కు చేరింది. రిన్ పౌడర్ కేజీ ప్యాక్ ధర రూ.120 నుంచి రూ.123కు, రిన్ అలా 500 మి.లీ ధర రూ.90 నుంచి రూ.95కు పెరిగింది. వీల్ పౌడర్ కేజీ ప్యాక్ ధర రూ.90 నుంచి రూ.93కు చేరింది.
సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ ధరలు పెంపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)