నవతెలంగాణ - హైదరాబాద్ : విశాఖపట్నం మధురవాడ పరిధిలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కర్రి జ్ఞానేశ్‌వర్మ (19) బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిథిలాపురి వుడా కాలనీలో ఒంటరిగా ఉంటున్న అతడు గదిలో మృతి చెందాడు. బుధవారం పనిమనిషి గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన మనసుతో ఎవరో ఆడుకున్నారని, తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, తన కోసం ఎవరూ బాధపడొద్దని, అక్కను ఉద్దేశించి భావోద్వేగంగా రాసినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖలో బీటెక్ విద్యార్థి బలవన్మరణం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)