నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత నానాపటేకర్(75) గురువారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 5.20 గంటలకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యలు ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందారు. ఆయన మరణవార్తతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
1978లో 'గమన్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నానా పటేకర్, తన విలక్షణమైన నటన, డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'పరిందా', 'అబ్ తక్ ఛప్పన్', 'యశ్వంత్', 'వజూద్' వంటి చిత్రాలతో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 2000 తర్వాత 'శక్తి: ది పవర్', 'అపహరణ్', 'టాక్సీ నెం 9211' వంటి సినిమాల్లో ఆయన నటన విమర్శకుల మన్ననలు పొందింది.
ఒకవైపు సీరియస్ పాత్రలతో అలరిస్తూనే, మరోవైపు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 'వెల్కమ్' (2007), 'వెల్కమ్ బ్యాక్' (2015) చిత్రాలలో ఆయన పోషించిన 'ఉదయ్ శెట్టి' పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 'రాజ్‌నీతి' చిత్రంలో ఆయన నటనకు ఫిలింఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. తన అద్భుత నట ప్రస్థానంలో మూడు జాతీయ అవార్డులను అందుకున్నారు.






కామెంట్‌లు (0)