నవతెలంగాణ - హైదరాబాద్ : ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయ ప్రాంగణంలోని శివ తారకేశ్వరాలయం, గొల్లల గుడిలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2021 జూలై 25న యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయ పరిధిలోని ఈ రెండు ఉపాలయాలను భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలుగా ప్రకటించింది. ఇకపై ఈ రెండు ఆలయాల జీర్ణోద్ధరణ, పరిరక్షణ బాధ్యతలను ఏఎస్‌ఐ చేపట్టనుంది. ఆలయాల చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు, చారిత్రక కట్టడాల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. తద్వారా ఈ అరుదైన వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టనున్నారు.
రామప్ప పరిధిలో మరో రెండు ఆలయాలకు జాతీయ గుర్తింపు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)