Magazines

నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకే ఓట్ల తొలగింపు: వీహెచ్

7 గంటల క్రితం

VH HANUMANTHA RAO
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ద్వారా ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని (ఈసీ) తన గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగింపజేస్తున్నారని వీహెచ్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి, కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలనే దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్