– రైతు నేస్తం సలహాలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలి
– ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి
– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం అందించే రాయితీలను సద్వినియోగం ఔను చేసుకుంటూ, రైతు నేస్తం సలహాలను పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు రైతులకు సూచించారు. జాతీయ ఆహార భద్రత – పోషణ పధకం లో భాగంగా రాయితీపై వరి విత్తనాల పంపిణీ ని రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో మంగళవారం వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రైతులకు వరి విత్తనాల పంపిణీ ని లాంచనంగా ప్రారంభించారు. అనంతరం అశ్వారావుపేట రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు రైతులకు వరి విత్తనాలు అందజేశారు.
వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు పెంటేల కుమార్ మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజక వర్గం వ్యాప్తంగా 450 ఎకరాల కు సరిపడా 90 క్వింటాళ్ళ ఆర్ఎన్ఆర్ – 15048,ఎంటీయూ – 1010 వరి వంగడాల విత్తనాలను పంపిణీ చేస్తున్నాం అని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ రెడ్డి( ఇంచార్జి),ఏఈఓ సతీష్,రైతులు పాల్గొన్నారు.



