Tuesday, April 7, 2026
E-PAPER
Homeజిల్లాలుధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే మందుల సామేలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే మందుల సామేలు

- Advertisement -

నవతెలంగాణ తుంగతుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. మధ్య ద‌ళారుల ద్వారా నష్టపోకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రంలో ధాన్యం తూకం, చెల్లింపుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు కొనుగోలు కేంద్రాలలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, వెంటనే సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ :

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తుంగతుర్తి సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రేగటి రవి, ఎంపిడిఓ శేషు కుమార్, తహసిల్దార్ దయానందం, ఏపీఎం యాదమ్మ, తుంగతుర్తి పట్టణ అధ్యక్షులు రాంబాబు, సీఈఓ యాదగిరి, మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -