నవతెలంగాణ – పెద్దవంగర
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం ఎండీ పాషా అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డెకొత్తపల్లి, పోచంపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. సన్న వడ్లకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి, గరిష్ట మద్దతు ధర పొందాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్తినేని శ్రీనివాస్, బండారి వెంకన్న, సీసీలు సుధాకర్, సుజాత, ఉమా, కంప్యూటర్ ఆపరేటర్ నూకల అనిల్, రవి, నిర్మల, సోమన్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



