Friday, May 2, 2025
Homeతెలంగాణ రౌండప్క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ 
పెద్దవంగర లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం 
నవతెలంగాణ – పెద్దవంగర

వేసవి క్రీడా శిబిరాలను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో అథ్లెటిక్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ కంచర్ల ప్రభాకర్ తో కలిసి మాట్లాడుతూ.. చిన్నారులు తమకు నచ్చిన క్రీడా అంశాన్ని ఎంపిక చేసుకొని అందులో రాణించాలన్నారు. నెల రోజుల పాటు జరిగే అథ్లెటిక్స్, వాలిబాల్ క్రీడాల్లో కోచ్‌ లు, సీనియర్‌ క్రీడాకారులు పర్యవేక్షణలో మెలకువలు నేర్చుకొని ఆటలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, తకీ పాషా, హైమ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img