నవతెలంగాణ – మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని యాద్గార్పల్లి పశువైద్యశాలలో నిర్వహించిన పశువులకు గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని ఆయన ఎమ్మెల్సీ కెతావత్ శంకరా నాయక్ తో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నెల రోజులపాటు ఈ గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం జరుగుతుందని కావునా పాడి రైతులు తమ పశువులను పశువైద్యశాలకు తీసుకొచ్చి టీకాలు వేయించాలని అన్నారు.
వ్యవసాయంలో పశుసంపద వల్ల తయారయ్యే సేంద్రీయ ఎరువుల వాడకం పెంచుకోని రసాయన ఎరువులను తగ్గించాలని కోరారు. తద్వారా బలమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలమని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గాయం ఉపేందర్రెడ్డి, అప్పనబోయిన వెంకటయ్య, తలకొప్పుల సైదులు, జంగిలి లింగయ్య, జిట్టబోయిన వెంకన్న, నాగిరెడ్డి, వెంకట్రెడ్డి, పశువైద్యులు, పశువైద్యులు, జె.వెంకట్రెడ్డి, శంకర్రావు, జ్ఞానేశ్వర్ ప్రసాద్, దుర్గ రమాదేవి, సందీప్, నాగేందర్, చిరంజీవి, జానిపాషా, కృష్ణ, పాడి రైతులు పాల్గొన్నారు.