మార్కెట్ చైర్మన్ అబ్దుల్ హాది..
నవతెలంగాణ – సారంగాపూర్: రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది అన్నారు. శుక్రవారం మండలంలోని బీరవెల్లి, ప్యారాముర్, తాండ్ర, వైకుంఠపూర్, వంజర్, మలక్ చించోలి, ధని, గోపాలపెట్, చించోలి(బి) గ్రామాలలో ఐ కె పి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి క్వింటాలుకు మెదటి రకం నికి రూ. 2320/- రెండవరకం నికి రూ.2300/- మద్దతు ధర పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శంకర్ రెడ్డి ,డైరెక్టర్లు శుభాష్ రెడ్డి, పోతారెడ్డి, ప్రశాంత్ మండల్ స్పెషల్ ఆఫీసర్ భాలిగ్ అహ్మద్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రమేష్, మధుకర్, భూమారెడ్డి, ముత్యంరెడ్డి మురళి, సాయన్న, ప్రేమానంద్, భోజన్న, సూర్యం సత్యం, మషీర్, ముక్త్యార్ , రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES