Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురూ.80వేలు లంచం తీసుకుంటూ..

రూ.80వేలు లంచం తీసుకుంటూ..

- Advertisement -

– ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్‌ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ
నవతెలంగాణ-మహబూబాబాద్‌

రూ.80వేలు లంచం తీసుకుంటూ మహబూబాబాద్‌ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నరేశ్‌ బుధవారం ఏసీబీకి పట్టుబడిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన ఎన్‌పీడీసీఎల్‌ కాంట్రాక్టర్‌.. మహబూబాబాద్‌, కురవి మండలాల్లో ఎన్‌పీడీసీఎల్‌ సంస్థలో మరమ్మత్తులు చేయడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. కాగా అతనికి రూ.20 లక్షలు చేసే పనులకు మాత్రమే లైసెన్స్‌ ఉన్నది. కానీ, అతను రూ.20 లక్షలకుపైగా పనులు చేశారు. దాంతో బిల్లులు పొందడం కోసం లైసెన్స్‌ను రూ.20 లక్షలకు పైగా ఎక్స్‌టెన్షన్‌ చేయడం కోసం ఫైల్‌ పెట్టుకున్నాడు. ఈ ఫైల్‌ని ఏఈ, ఏడీఈ, డీఈ అప్రూవల్‌ చేశారు. కానీ ఎస్‌ఈ వద్ద ఫైల్‌ పెండింగ్‌లో ఉంది. ఆ ఫైల్‌ క్లియర్‌ చేయడానికి ఎస్‌ఈ నరేశ్‌ కాంట్రాక్టర్‌ను రూ.లక్ష లంచం అడిగారు. తాను అంత ఇచ్చుకోలేనని ఎన్నిసార్లు బతిమాలినా వినిపించుకోలేదు. దాంతో ఈనెల 14వ తేదీన రూ.20వేలు చెల్లించినప్పటికీ ఇంకా రూ.80,000 ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దాంతో సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం ఉదయం 8 గంటలకు మహబూబాబాద్‌లోని హస్తినాపురంలో ఎస్‌ఈ ఇంటివద్ద రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఈని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తరలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad