Sunday, April 12, 2026
E-PAPER
Homeనల్లగొండచౌటుప్పల్‌లో మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

చౌటుప్పల్‌లో మైనారిటీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో చౌటుప్పల్ మైనారిటీ గురుకుల కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి బాలకృష్ణ తెలిపారు.మొదటి సంవత్సరం ఫలితాల్లో సి.హెచ్ చరణ్ 500 మార్కులకు గాను 466 మార్కులు సాధించగా, రెండో సంవత్సరం ఫలితాల్లో ఎం. నవీన్ 1000 మార్కులకు గాను 966 మార్కులు సాధించినట్లు తెలిపారు.అలాగే మొదటి సంవత్సరం ఫలితాల్లో కళాశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం ఫలితాల్లో 92 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపల్ బాలకృష్ణ విద్యార్థులను అభినందనలు తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -