Sunday, February 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్

విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెతికి తీయడం కోసమే టాలెంట్ టెస్ట్

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను రాయాలని విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన తెలివితేటలను వెలికి తీయడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు దాసరి ప్రకాష్ తిగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం అరవిందో జూనియర్ కళాశాల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రం అరవింద జూనియర్ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్ గౌడ్ ఆవిష్కరించి మాట్లాడుతూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం లక్ష్యాలలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులతో సమస్యలే కాకుండా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మక తీయడం కోసం నిరంతరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, త్వరలో రాబోయే పదవ తరగతి పరీక్షలను ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాసి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రుల కళల్ని నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులు ముందుగా భయాన్ని విడిచిపెట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడ జరుగుతుంది, చదివే అన్నింటికీ మూలమని ఉన్నతంగా చదివి జీవితంలో మంచి స్థానంలో ఉండాలని అన్నారు. ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు, ఎస్ఎఫ్ఐ నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్టులో 300 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరై పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు SFI మండల సహాయ కార్యదర్శి సాతిరి మనోజ్ మండల ఉపాధ్యక్షులు దోనూరు శ్రావణ్, ఈరిగి వరుణ్,. నాయకులు మల్లేష్ నవదీప్ ,సృజన,చంద్రిక ప్రసన్న అనూష మనీషా శిరీష . కీర్తన అనూష ఝాన్సీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -