నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్‌తో చర్చలు జరిగితే అది ఉగ్రవాద నిర్మూలన, POK అప్పగింతపైనే అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడి జరిగితే.. అది యాక్ట్ ఆఫ్ వార్ గానే పరిగణిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇండియన్ ఆర్మీని రెచ్చగొడితే ఎలా ఉంటుందో.. పాక్‌కు తెలిసి వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సరిహద్దులో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. అనంతరం బదామీ బాగ్ కంటోన్మెంట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన సైనికులు, పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన పౌరులకు నివాళులర్పిస్తున్నానని తెలిపారు.యుద్ధ వాతావరణంలో సైనికుల ధైర్య సాహసాలు మరువ లేవనివని ఆయన కొనియాడారు.
