Monday, February 23, 2026
E-PAPER
Homeజాతీయంత‌మిళ‌నాడు ఓట‌ర్ జాబితా విడుద‌ల

త‌మిళ‌నాడు ఓట‌ర్ జాబితా విడుద‌ల

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న‌ రాష్ట్రాలైన కేర‌ళ‌, త‌మిళ‌నాడు, అసోంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌మ‌గ్ర ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ ప్రక్రియ‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితాను విడుద‌ల చేసింది. ఈ క్రమంలోనే సోమవారం తుది ఓటరు జాబితాను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో (Tamil Nadu) మొత్తం 5.67కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించింది. పురుషులు 2,77,38,925, మ‌హిళాలు 2,89,60,838 ఉండ‌గా, టాన్స్ జెండ‌ర్ 7,617 మంది ఉన్నట్లు ఈసీ పేర్కొంది.

గతేడాది అక్టోబరు చివరి నాటికి రాష్ట్రంలో 6.41కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన తర్వాత గతేడాది డిసెంబరు 19న ముసాయిదా ఓటర్ల జాబితాను (Tamil Nadu Voter List) ఈసీ విడుదల చేసింది. అందులో ఓటర్ల సంఖ్యను 5.43కోట్లుగా పేర్కొంది. అంటే.. దాదాపు 97లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. అనంతరం ఓటు హక్కు కోల్పోయిన వారు అభ్యంతరాలు తెలిపేందుకు కొంత గడువు కల్పించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -