నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా ఎన్నికల చరిత్రలో మరో భారతీయ మహిళ చరిత్ర సృష్టించారు. వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా 31 ఏళ్ల రిని సంపత్ చరిత్ర సృష్టించారు. రిని సంపత్ తమిళనాడులో జన్మించారు. ఏడేళ్ల వయసులోనే తల్లిందడ్రులతో అమెరికాకు వలస వచ్చిన ఆమె.. ఇప్పుడు మేయర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన నామినేషన్ అర్హతను సాధించడం విశేషం. డెమొక్రటిక్ పార్టీకి చెందిన రిని సంపత్.. ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ‘ఫిక్స్ ది బేసిక్స్’, ‘ఒక కొత్త డీసీ’ అనే నినాదాలతో ప్రచారం చేస్తున్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం, ధరలను తగ్గించడం, మొదలైన వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టంచేశారు.
వాషింగ్టన్ మేయర్ బరిలో తమిళనాడు మహిళ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



