- Advertisement -
– పాడి రైతుకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-కోహెడ
సాగు రైతులకే కాదు, పాడి రైతులకు కూడా వేసవికాలంలో నీటి కష్టాలు తప్పడం లేదు. వేసవికాలం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయి వ్యవసా యంతో పాటు మూగజీవుల దాహం తీర్చేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన రైతు మొగురం వెంకటస్వామి పశువులకు వాటర్ ట్యాంకర్‌తో నీటిని తెచ్చి దాహం తీర్చుతున్నాడు. ఇటీవల ఈదురుగాలులతో కురిసిన వర్షానికి బావి వద్ద మోటర్ కాలిపోవడంతో బోర్ పోయడం లేదని తెలిపారు. దాంతో పశువుల దాహం తీర్చేందుకు వాటర్ ట్యాంకర్ తెప్పించినట్టు తెలిపారు.
- Advertisement -