- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: శ్రీచైతన్య స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న తన్విక SIP ABACUS పోటీల్లో ఫౌండేషన్ ఫోర్త్ లెవల్‌లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి పాఠశాల్లో విద్యార్థిని అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ..3600 మంది పాల్గొన్న పోటీలో శ్రీ చైతన్య విద్యార్థి ప్రతిభ చాటరని, ఇది గొప్ప విషయమని కొనియాడారు.
శ్రీచైతన్య ఎజీఎం మహ్మద్ నూర్ అలీ, ఆర్‌ఐ మల్లికార్జున్ నాయుడు, ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ కీర్తి, ప్రైమరీ ఇంచార్జ్‌లు రేచల్, నవీనాథ SIP ABACUS పోటీల్లో ప్రతిభ చాటిన తన్వికను అభినందించారు.
- Advertisement -