- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది.
- Advertisement -



