నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుని ఎర్రితనానికి హద్దులు శృతిమించాయి. ప్రపంచదేశాలపై విధించిన 10శాతం సుంకాలను 15శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. అదనపు సుంకాలను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు వివిధ న్యాయ, చట్టబద్ధమైన మార్గాల్లో మరిన్ని సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు. ట్రంప్ అడ్డగోలు అదనపు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేయడంతో.. అంతకుముందటి పాత సుంకాలు తిరిగి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. వెంటనే పాత యాంటీ డంపింగ్, కౌంటర్ వెయిలింగ్, జాతీయ భద్రత సుంకాలను 10శాతానికి పెంచారు. మరునాడే దీనిని 15శాతానికి పెంచుతున్నట్టు ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
సుంకాలు 10నుంచి 15శాతానికి పెంపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



