- Advertisement -
– ఒకరికి తీవ్ర గాయాలు
– ఉప్పెరగూడెం శివారులో ఘటన
నవతెలంగాణ పెద్దవంగర: టాటా ఏస్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని ఉప్పరగూడెం శివారులో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శాస్త్రబోయిన యాకయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం అవుతాపురం వెళ్లి తన ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టాటా ఏస్, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో యాకయ్యకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్సై క్రాంతి కిరణ్ ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.
- Advertisement -