Wednesday, April 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్‌ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ..

సీఎం రేవంత్‌ రెడ్డితో టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఎండీ భేటీ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ మరియు నూతన పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయబోతోంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలోని TASLలో F-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు TASLతో లాక్‌హీడ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -