Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంజడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం

జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. ఈ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి డిపాజిట్‌ కోల్పోయారు. వైసీపీకి 683 ఓట్లు లభించాయి. స్వతంత్ర అభ్యర్థులు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. ఈ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 11 మంది బరిలోకి దిగారు.

కాగా, ఈ ఎన్నికలో లతారెడ్డి గెలుపొందినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి సవిత అభినందించారు. ఈ విజయం కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad