Magazines

ఐదు రోజులు మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

53 నిమిషాల క్రితం

Mission Bhagiratha
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - రామకృష్ణాపూర్‌:
క్యాతన్ పల్లి ఫ్లైఓవర్‌ నుంచి విఠల్‌నగర్‌ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్న నేపథ్యంలో మిషన్‌ భగీరథ పైపులైన్లను పక్కకు మార్చే పనులు చేపడుతున్నట్లు క్యాతనపల్లి మున్సిపాలిటీ అధికారులు తెలిపారు. దీంతో రామకృష్ణాపూర్‌ ప్రాంతంలో అక్టోబరు 1 నుంచి సుమారు ఐదు రోజుల పాటు మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. పైపులైన్లను పక్కకు మార్చి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు సుమారు ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ తాగునీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రజలు తమకు అందుబాటులో ఉన్న బోరుబావుల నుంచి నీటి సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రామకృష్ణాపూర్‌ ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పత్రికా ప్రకటనలో  కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్